గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్ళీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో పసిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు. హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 1040 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.56,360 కి చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 970 పెరుగుదలతో రూ.51,670కు చేరింది.
అలాగే వెండి ధర కూడా భారీగా పెరిగిపోయింది. కేజీ వెండి ధర రూ. 2200 పెరిగిపోయింది. దీంతో ధర రూ.71,100కి చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పరుగులు పెట్టింది. బంగారం ధర ఔన్స్ కు 2 వేల డాలర్ల పైకి చేరింది. ఇక బంగారం బాటలోనే నడిచిన వెండి ధర ఔన్స్ కు 28 డాలర్ల దాకా ఉంది.