పసిడి ధర మళ్లీ పైకి కదిలింది. 26.10.2019 శనివారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర శుక్రవారం తో పోలిస్తే ఏకంగా రూ.250 పెరిగింది. దీంతో ధర రూ.40,220కు చేరింది. కాగా, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 240 రూపాయలు పైకెగసింది. దీంతో.. 36,870 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక శుక్రవారం భారీగా పెరిగిన వెండిధరలు శనివారం ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 48,770 రూపాయల వద్ద నిలిచింది.
ఢిల్లీ మార్కెట్ లో కూడా పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు పైకెగసింది. దీంతో 38,850 రూపాయల వద్దకు 24 క్యారెట్ల బంగారం ధర చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 250 రూపాయలు పెరగడంతో 37,650 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక వెండి ధర ఇక్కడ కూడా స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 26.10.2019 శనివారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.