భారతీయులు ఆనందంగా జరుపుకొనే దీపావళి వేడుకలను అగ్రరాజ్యం అమెరికాలో ఈరోజు ఉత్సాహంగా ప్రారంభించారు. వైట్‌హౌస్ (శ్వేతసౌధం)లో జరిగిన వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న వెలుగుల పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, జైనులు, సిక్కులు, బుద్ధిస్టులకు తనతో పాటు భార్య మెలానియా ట్రంప్ తరఫున కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాలో దీపావళి వేడుకలు జరుపుకోవడం తమ దేశంలోని మత స్వేచ్ఛకు నిదర్శనమని ట్రంప్ అన్నారు. దేశంలోని అన్నిమతాల ప్రజలు తమ విశ్వాసాలకు అనుగుణంగా పండుగ జరుపుకొనే స్వేచ్ఛ అమెరికా కల్పిస్తోందని, వారి హక్కులను కాపాడేందుకు కృషి చేస్తామని తెలిపారు. అమెరికా అధ్యక్షుని అధికారిక నివాసమైన వైట్‌హౌస్‌లో 2009 నుంచి వేడుకలు జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోంది..