బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం మాయమైంది. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని తుని మండలం తేటగుంటలో ఆదివారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. కెనరా బ్యాంక్‌లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం మాయం కావడంపై వినియోదారులు ఆందోళనకు దిగినట్లు సమాచారం.
అయితే, బ్యాంకులో పనిచేస్తున్న అప్రైజర్ 160 మంది ఖాతాదారుల బంగారు నగలను మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. కాగా, తమ బంగారం మాయం కావడంతో బ్యాంకు వద్దకు వచ్చి ఖాతాదారులు ఆందోళన చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసుల బ్యాంకు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బ్యాంకులో బంగారం మాయం..
కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట కెనరా బ్యాంక్‌లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం మాయం.
బ్యాంకులో పనిచేస్తున్న అప్రైజర్ 160 మంది ఖాతాదారుల బంగారు నగలను మాయం చేసినట్లు గుర్తించిన అధికారులు. తమ బంగారం మాయం కావడంతో బ్యాంకు వద్దకు వచ్చి ఆందోళన… pic.twitter.com/ULRDOdRNRe— ChotaNews App (@ChotaNewsApp) February 16, 2025