హైదరాబాద్ లో సంచలనం.. డ్రైనేజ్ లో పడిపోయిన కిలోన్నర బంగారం

-

హైదరాబాద్ లో సంచలన సంఘటన జరిగింది. అదేంటంటే డ్రైనేజ్ లో కిలోన్నర బంగారం మాయం అయింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే వి ఎస్ గోల్డ్ షాప్ నుంచి బంగారం తెస్తుండగా సేల్స్ మెన్ చేతిలోని బంగారం సంచి బంజారాహిల్స్ లోని మురికి కాలువలో పడిపోయింది. ఒక కస్టమర్ కోసం బషీర్ బాగ్ లో ఉన్న విఎస్ గోల్డ్ జ్యూయలర్స్ నుండి జూబ్లీహిల్స్ లోని కృష్ణా పెరల్స్ షాపుకు నగలు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే రాత్రంతా కాలువలో సిబ్బంది అంతా గాలించగా బంగారం సంచి లభ్యమైంది కానీ అందులో బంగారం లేదు.

Beautifully crafted traditional Indian gold jewellery for women. The ornaments are known as bangles worn to hands and made up of 22 carat gold.

దీంతో సంచి ఉండి, అందులోని కిలోన్నర బంగారం మాయమైందనీ వి ఎస్ గోల్డ్ షాప్ యజమాని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు సేల్స్ మెన్ ను అదుపులోకి తీసుకున్నారు. సీసీ టీవీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రదీప్ అనే సేల్స్ మెన్ బంగారాన్ని టూ వీలర్ పై తరలిస్తున్న క్రమంలో బండి స్కిడ్ అయిందని దీంతో ఆ నగల సంచి భారీ వర్షంతో కూడిన వరద నీటిలో కొట్టుకు పోయిందని చెబుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version