గత కొద్ది రోజుల క్రితం వరసగా పెరిగి హడలెత్తించిన బంగారం ధరలు.. ప్రస్తుతం కాస్త ప్రశాంతగా కనిపిస్తున్నాయి. క్రితం మూడు రోజుల నుంచి బంగారం ధరలు పెరగడం లేదు. మంగళవారం భారీ గా తగ్గిన బంగారం ధరలు.. బుధవారం, ఈ రోజు నిలకడగా ఉన్నాయి. వెండి ధరలు కూడా వరసగా రెండో రోజు తగ్గాయి. బుధవారం ప్రతి కిలో గ్రాము వెండిపై రూ. 400 తగ్గగా.. నేడు రూ. 300 తగ్గింది.
దీంతో వెండి ధరలు రూ. 71 వేల నుంచి కిందకు దిగింది. కరోనా వైరస్ వ్యాప్తి తో పాటు ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వల్ల బంగారం ధరలు రూ. 53 వేలు, వెండి ధరలు రూ. 73 వేల మార్క్ ను అందుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కాగ ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ నగరాల్లో ప్రతి 10 గ్రాముల బంగారం.. 22 క్యారెట్లకు రూ. 47,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,140 గా ఉంది. దీంతో పాటు ప్రతి కిలో గ్రాము వెండి ధర రూ. 70,700 గా ఉంది.