ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలోనే కొత్త కేబినేట్ కొలువు దీరనుంది. ఈ నేపథ్యంలోనే.. నేడు ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. జగన్ ప్రభుత్వానికి చెందిన రెండో కేబినేట్ కొలువు దీరనుండటంతో.. మొదటి కేబినేట్ చిట్ట చివరి మంత్రి వర్గ సమావేశం కూడా ఇవాళ జరుగనుంది. ఈ కేబినేట్ సమావేశం అనంతరం ఏపీ మంత్రులంతా రాజీనామా చేయనున్నారు.
మంత్రి మండలిలోని.. మొత్తం 25 మంది మంత్రుల నుంచి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. రాజీనామాలు తీసుకోనున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుత మంత్రి మండలి చివరి సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో.. జరుగనుంది.
మంత్రి మండలి సమావేశ ఎజెండాను సిద్దం చేశారు. ఈ సమావేశంలోనే మంత్రుల రాజీనామాను సీఎం జగన్ కోరే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. త్వరాత ప్రక్రియను ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం ఆధ్వర్యంలో.. పూర్తి చేయనున్నారు.ఇక ఏప్రిల్ 11 వ తేదీన కొత్త మంత్రి మండలి ఏర్పాటు కానుంది.