బంగారం ధరలు శుక్రవారం (జూలై 3, 2020) స్వల్పంగా తగ్గాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర 0.2 శాతం తగ్గింది. దీంతో బంగారం ధర రూ.48,171 పలుకుతోంది. ఇక కిలో వెండి ధర 0.48 శాతం తగ్గడంతో దాని ధర రూ.49,187గా ఉంది.
బంగారం ధరలు తగ్గేందుకు రూపాయ క్రమంగా బలపడడమే కారణమని తెలుస్తోంది. అక అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ఏర్పడడం, భారత్, చైనా సరిహద్దు వివాదాలు వంటి కారణాల వల్ల కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ ఈ ఏడాది బంగారం ధర 25 శాతానికి పైగా పెరగడం విశేషం.
ఇక హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,340గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950గా ఉంది. అయితే కొంత కాలం పాటు బంగారం ధర స్థిరంగానే ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.