మరోసారి పరుగులు తీస్తున్న పసిడి..!

-

బంగారం కొనుగోలు చెయ్యాలని మీరు అనుకుంటున్నారా…? అయితే ఇది మీకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. గత నాలుగు రోజులు నుండి చూస్తే ధరలు పెరిగాయి.. నిన్న మాత్రం కాస్త తగ్గింది అని అనుకునే లోపే మరో సరి ధరలు పైకి కదిలాయి. ఇది పసిడి ప్రియులకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

శుక్రవారం నాడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 పైకి కదిలింది. దీంతో రేటు రూ.49,750కు చేరుకుంది. ఇది ఇలా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదే విధంగా పెరిగింది. రూ.150 పెరుగుదలతో రూ.45,600కు చేరింది.

బంగారం తో పాటుగా వెండి రేటు కూడా పెరిగింది. కనుక వెండి కొనాలన్నా కష్టమే. అంతర్జాతీయ మార్కెట్‌ లో మాత్రం బంగారం ధర పడిపోయింది. బంగారం ధర ఔన్స్‌కు 0.48 శాతం తగ్గింది. ఇలా జరగడం తో ఔన్స్‌కు 1872 డాలర్లకు తగ్గింది.

ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు లాంటి ప్రభావం బంగారం మీద పడుతుంది అన్న సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news