గుడ్ న్యూస్; భారీగా పడిన బంగారం ధర…!

-

స్టాక్ మార్కెట్ ప్రభావం బంగారం పై పడింది. ధర పెరుగుతుందని ఊహించిన బంగారం గత వారం రోజులుగా ధరలు భారీగా పతనమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్ బలహీనంగా ఉండటం వల్లే బంగారం  ధరలు భారీగా తగ్గుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఈక్విటీలో నష్టపోయిన ఇన్వెస్టర్లు బంగారాన్ని అమ్మి లాభాలు పొందేందుకు పోటీపడటం కూడా బంగారం ధరలు తగ్గడానికి మరో కారణమని భావిస్తున్నారు.

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 17 పైసలు బలపడింది. రూపాయి బలపడటం, అంతర్జాతీయ మార్కెట్ బలహీన పడటం వంటి ప్రభావం బంగారం పై పడింది. ఇదే క్రమంలో వెండి కూడా దిగివచ్చింది.  బంగారం ధర రూ.50,000 వైపు పరుగులు తీస్తుందనుకున్న న్యూ ఢిల్లీలో రూ.40,000 దిగి రావడం విశేషం. న్యూ ఢిల్లీలో బంగారం ధర 6 రోజుల్లో ఏకంగా రూ.5,000 తగ్గింది. హైదరాబాద్‌లో కూడా గోల్డ్ రేట్ తగ్గుతోంది. హైదరాబాద్‌లో మంగళవారం బంగారం ధర భారీగా పడిపోయింది.

ఒక్క రోజే 10 గ్రాములపై రూ.920 తగ్గడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారట్ గోల్డ్ ధర రూ.42,300 కాగా, 22 క్యారట్ బంగారం ధర రూ.38,700. న్యూఢిల్లీలో మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై రూ.80 తగ్గి రూ.39,719 ధరకు చేరుకుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,483 డాలర్లు. ఇదే క్రమంలో వెండి ధర కూడా తగ్గుతోంది. హైదరాబాద్‌లో వెండి ధర భారీగా తగ్గి  కేజీ వెండి ధర రూ.41,780 కు వచ్చింది. న్యూ ఢిల్లీలో కూడా వెండి భారీగా తగ్గింది. కేజీపై రూ.734 తగ్గడంతో రూ.35,948 ధరకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version