భారీ వసూళ్ళు వస్తాయనుకున్న నితిన్ భీష్మ కి కరోనా వైరస్ పాకేసిందిగా ..!

-

మాటల మాంత్రీకుడు త్రివిక్రం దర్శకత్వం వహించిన ‘అ..ఆ’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు యంగ్ హీరో నితిన్. అంతే ఆ తర్వాత ఈ హీరోకి మళ్ళీ హిట్ దక్కలేదు. అ..ఆ తర్వాత వచ్చిన లై, ఛల్ మోహన రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు దారుణంగా ఫ్లాపయ్యాయి. దాంతో బాగా గ్యాప్ తర్వాత నితిన్ కి ఒక హిట్ సినిమా దక్కింది. మళ్ళీ రీసెంట్ గా వచ్చిన భీష్మ సినిమాతో యంగ్ హీరో నితిన్ హిట్ ని అందుకున్నాడు. కానీ అది హిట్ టాక్ అంతే. కలెక్షన్స్ పరంగా మాత్రం ఇంకా రాబట్టాల్సింది చాలా ఉంది. సేఫ్ జోన్ లోకి వచ్చినప్పటికి అనుకున్న లాభాలను రాబట్టడంలో మాత్రం భీష్మ మేకర్స్ కి గట్టి దెబ్బ పడింది. భారీ లాభాలు చూస్తాయనుకున్న భీష్మ మేకర్స్ కి కరోనా షాకిచ్చి కలెక్షన్స్ కి గండి కొట్టేసింది.

 

ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు ఓవర్సీస్ లో కూడా లాభాల సాధించే దిశగా పయనిస్తోంది. షేర్స్ కూడా బాగా ఉన్నాయంటున్నారు. అయితే సరిగ్గా ఇలాంటి టైమ్ లో కరోనా .. మేకర్స్ ఆశల మీద నీళ్ళు చల్లేసింది. చైనా నుంచి భారత్ వరకూ కరోనా వణికిస్తోంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమపై ఈ కరోనా ఎఫెక్ట్ దారుణంగా పడింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కరోనా తో వణుకుతున్నారు. ఇళ్ళల్లో నుంచి బయటకి అడుగు పెట్టాలంటే హడలిపోతున్నారు.

అయితే ఈ ఏప్రిల్ వరకూ భీష్మ సినిమాకి గట్టి పోటీ ఇచ్చే సినిమా ఏదీ లేకపోవడంతో ఈ సీజన్ అంతా తమ సినిమాకి బాగా ఉపయోగపడుతుందని నితిన్ తండ్రి, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి ఎంతో ఆశ పడ్డారు. కానీ అది సాధ్యపడలేదు. ప్రస్తుతం ఐమ్యాక్స్ సహా హైదరాబాద్ నగరంలోని థియేటర్లన్నీ బంద్ అయ్యాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా థియేటర్లు బంద్ అయ్యాయి. దీంతో అన్నిచోట్లా భీష్మ కు అనుకున్న వసూళ్ళు రాక పెద్ద దెబ్బ పడింది. ఒక రకంగా చాలా పెద్ద మొత్తంలోనే షేర్ ని భీష్మ నష్టపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాపం నితిన్ సినిమా హిట్ అని చెప్పుకుంటున్నప్పటికి కలెక్షన్స్ లేక ఉసూరుమంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version