భారీగా పెరిగిన బంగారం ధరలు

-

గత కొద్ది రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు ఈ రోజు మాత్రం నిన్నటి ధర భారీగా పెరిగాయి. పండుగ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి చేదు వార్త అనే చెప్పాలి. నిజానికి గత ఐదు రోజులుగా బంగారం ధర పెరుగుతూనే వస్తోంది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పెరుగుతూ పోతోంది. హైదరాబాద్‌ సహా విశాఖ పట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹52,380కి పెరిగింది.

అలానే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹48,020కి పెరిగింది. అయితే ఢిల్లీ మార్కెట్‌ లో మాత్రం ఈ రేట్ కాస్త భారీగానే పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.55,040కి చేరింది. ఇక గత 5 రోజుల్లో కేజీ వెండి ధర రూ.690 దాకా పెరిగింది. అయితే నిన్నటి మీద కేజీకి పదిరూపాయలు పెరగడంతో కేజీ వెండి ధర 65,410 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక మరో పక్క ఈ నెల 13న ధంతేరస్, 14న దీపావళి కాబట్టి… ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news