LIC పెన్షన్.. ఖాతాదారుడికి ప్రతి నెల రూ.36000..!

-

దేశీ దిగ్గజ ప్రభుత్వ బీమా రంగ కంపెనీ లైఫ్​ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవడం వల్ల కుటుంబ భద్రతతోపాటు మంచి రాబడి పొందొచ్చని ప్రజలు విశ్వసిస్తుంటారు. అయితే ఎల్‌ఐసీ నుంచి ఎన్నో రకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీకు నచ్చిన పాలసీ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు కొత్తగా ఎల్‌ఐసీ నుంచి పాలసీ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం ఒక అదిరిపోయే పాలసీ అందుబాటులో ఉంది. ఒకసారి డబ్బు కొంత మొత్తం కట్టి జీవితాంతం ప్రతి నెల డబ్బులు పొందవచ్చు.

lic
lic

ఎల్‌ఐసీ స్కీమ్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. వీటిల్లో ఎల్‌ఐసీ జీవన్ అక్షయ పాలసీ కూడా ఒకటి. ఇది సింగిల్ ప్రీమియం పాలసీ. అంటే పాలసీ ప్రీమియం డబ్బులు ఒకేసారి చెల్లించాలి. అలాగే నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ పాలసీ.అంటే ఈ పాలసీని తీసుకోవడం వల్ల జీవితాంతం పెన్షన్ పొందొచ్చు. అరె ఇదేదో బాగుంది కదా అని అనుకుంటున్నారు కదూ..!

అయితే కనీసం రూ.లక్ష మొత్తానికి ఈ పాలసీ తీసుకోవలసి ఉంటుంది. గరిష్ట పరమితి అంటూ దీనికి ఏమీ లేదు. రూ.లక్ష మొత్తానికి పాలసీ తీసుకుంటే ప్రతి ఏడాది రూ.12,000 పెన్షన్ వస్తుంది. మీరు ఇన్వెస్ట్‌ చేసే డబ్బు ప్రాతిపదికన పెన్షన్ డబ్బులు ఆధారపడి ఉంటాయి. 35 ఏళ్ల నుంచి 85 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు ఈ పాలసీకి అర్హులు. పెన్షన్ ఎలా తీసుకోవాలనే దానికి 10 ఆప్షన్లు ఉంటాయి. ఉదాహరణకు 45 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి రూ.70 లక్షలకు ఈ పాలసీ తీసుకుంటే.. ప్రతి నెలా రూ.36 వేలకు పైగా పెన్షన్ పొందొచ్చు అనమాట. పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం ఈ పెన్షన్ వస్తూనే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news