అవును అండీ బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం కనపడుతుంది. ఊహించని విధంగా ధరల్లో మార్పు వచ్చేసింది. కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్ లు పడిపోతే ఆ ప్రభావం బంగారం ధర మీద బాగా పడింది. ఊహించని విధంగా ధరలు ఇప్పుడు తగ్గు ముఖం పడుతున్నాయి. గత మంగళవారం ధరలు 50 వేలకు చేరే అవకాశం ఉందని మీడియాలో ఎక్కువగా కథనాలు వచ్చాయి.
అయితే ఇప్పుడు ఆ ధరలు అనూహ్యంగా పడిపోతున్నాయి. కరోనా వైరస్ దెబ్బకు స్టాక్ మార్కెట్ లు కుదేలు అయిపోయాయి. దీనితో మదుపరులు బంగారం అమ్మి నష్టాల నుంచి బయటపడ్డారు. 22 క్యారెట్ల బంగారం 39 వేల స్థాయికి దిగొచ్చింది. ఈరోజు బంగారం ధర మళ్ళీ కిందకు దిగొచ్చింది. బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం భారీగా బంగారం ధరలు తగ్గయి.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 750 రూపాయలు తగ్గగా… 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 44,410 రూపాయల నుంచి 43,660 రూపాయలకు తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 850 రూపాయలు తగ్గింది. దీంతో 40,710 రూపాయల నుంచి 39,860 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర దిగివచ్చింది. ఈ ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి బంగారం కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఈ రెండు మూడు రోజుల్లో కొనుగోలు చెయ్యాలని పలువురు సూచిస్తున్నారు.