రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. నేటి నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇక ఈ సమావేశాల్లో వివాదాస్పద బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లోనే సరోగసి బిల్లు కూడా ఆమోదం పొందే అవకాశం ఉంది. 45 బిల్లు 7 ఆర్ధిక పద్దులు ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
ఇక ఈ సమావేశాల్లో ఢిల్లీ అల్లర్లపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. హోం మంత్రి అమిత్ షా రాజీనామా చెయ్యాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బిల్లులు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఢిల్లీ అల్లర్ల కేంద్రంగా విపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. అటు విపక్షాలను ఎదుర్కోవడానికి కూడా కేంద్రం సిద్దమైంది.
ఈ సమావేశాల సందర్భంగా కేంద్రం పలు కీలక నిర్ణయాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. జెడ్ ప్లస్ భద్రత ఉన్న వాళ్లకు బ్లాక్ కమాండో లను తొలగించే యోచనలో కూడా మోడీ సర్కార్ ఉంది. ఈ విషయం కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇక స్టాక్ మార్కెట్ లు కుప్ప కూలడం, ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతున్న అంశాలను టార్గెట్ గా చేసుకుని విపక్షాలు ఆరోపణలు చేసే అవకాశం ఉంది.