షాక్ ఇచ్చిన పసిడి, ఒక్కసారే ఎంత పెరిగిందో తెలిస్తే…!

-

కరోనా పుణ్యమా అని ఇన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ఇప్పుడు మళ్ళీ పెరుగుతూ పోతుంది. బాబోయ్ అంతా ఇంతా కాదు. ఏకంగా 1500 వరకు పెరిగింది పసిడి. బుధవారం స్వల్పం గా పెరిగిన బంగారం ధరలు, రెండో రోజు మాత్రం ఊహించని విధంగా పెరుగుదల నమోదు చేసాయి. దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1520 రూపాయలు భారీగా పెరిగి భయపెడుతుంది.

1520 పెరగడంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 43,790 రూపాయల నుంచి 45,310 రూపాయలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదే స్థాయిలో పెరుగుదల నమోదు చేసి… 10 గ్రాములకు 1390 రూపాయలు పెరిగింది. దీంతో 40,140 రూపాయల నుంచి 41,530 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1400 రూపాయలు పెరిగి 43,600 రూపాయల వద్దకు చేరింది.

ఇక వెండి విషయానికి వస్తే బుధవారం పెరగని వెండి ధరలు గురువారం మాత్రం భారీగా పెరిగాయి. వెండి ధర కేజీకి నిన్నటి ధర కంటే 1330 రూపాయలు పెరిగి 48,70 రూపాయల నుంచి 50,030 రూపాయలకు చేరుకుంది. ఇన్ని రోజులుగా పెరగని ధరలు ఇప్పుడు మాత్రం పెరుగుదల నమోదు చేయడంతో ఆందోళన మొదలయింది. దీనితో అమ్మకాలు భారీగా తగ్గాయి.

Read more RELATED
Recommended to you

Latest news