Gold-Silver Price: బంగారానికి ఉన్న డిమాండ్ ను ప్రత్యేకంగా చెప్పవల్సినవసరం లేదు. మన దేశంలో అయితే..పసిడి కొనుగోలుపై ఏలా దృష్టి పెడుతారో అందరికీ తెలుసు. దేశంలో బంగారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఏ చిన్న సందర్భం దొరికినా బంగారం, వెండి కొనుగోలుకు ఆసక్తిని చూపుతారు. బంగారం, వెండిపై వివిధ రూపాయల్లో పెట్టుబడి పెడతారు. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి శుభవార్త. గత వారంలో ఆకాశాన్ని తాకినా బంగారం ధరలు.. రెండురోజుల నుంచి నేలచూపులు చూస్తున్నాయి. నేడు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతేకాదు వెండి ధరకూడా భారీగా తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో నిన్న 22 క్యారెట్ల బంగారం రూ. 4,320లు నమోదు కాగా.. నేడు కూడా అదే ధర కొనసాగుతుంది. అలాగే నిన్న 10గ్రాముల బంగారం ధర రూ. 43,200 ఉండగా.. ధరలో ఎలాంటి మార్పులేకుండా సిర్థంగా కొనసాగుతుంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ 4,713 లతో.. 10 గ్రాముల బంగారం ధర నిన్నటి ధర రూ. 47,130 కొనసాగుతుంది. ఇవే ధరలు విశాఖ, విజయవాడలో కొనసాగుతున్నాయి.
వెండి ధర: నేడు వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. శనివారం కిలో వెండి ధర రూ.64,900 ఉండగా..భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ. 800 మేర తగ్గింది. దీంతో హైదరాబాద్ లో కిలో వెండి రూ. 64,100లుగా ఉంది. ఇదే ధరలు విజయవాడ, విశాఖ పట్నం లో కూడా కొనసాగుతున్నాయి.
అయితే.. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు అనేకం. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, ఫెడ్ రిజర్వ్ ప్రకటన, ప్రపంచవ్యాపంగా కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడం వంటి అంశాలు బంగారం పైన ప్రభావం చూపాయి. బంగారం ధరలు వచ్చే వారం కూడా పతనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.