శంషాబాద్ లో 2.5 కేజీల బంగారం పట్టివేత.. ఎక్కడో దాచారో తెలిస్తే షాకే !

-

గల్ఫ్ దేశాల్లో బంగారం తక్కువ ధరకు దొరుకుండడంతో కేటుగాళ్ళు అక్కడి నుండి ఇక్కడ అక్రమ మార్గాల్లో తీసుకు రావడానికి ఎన్నో తిప్పలు పడుతున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఐదు మంది ప్రయాణీకుల వద్ద 1.15 కోట్ల విలువ చేసే 2.5 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా కొత్త కొత్త పద్ధతుల ద్వారా బంగారం తరలిస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా ఈరోజు బంగారాన్ని మిక్సర్ గ్రైండర్ మోటార్, వైర్లు కట్ చేసే పరికరాల్లో దాచి తరలించే ప్రయత్నం చేసి దొరికిపోయారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలలో ఈ అక్రమ బంగారం రవాణా బయట పడింది. బంగారం స్వాధీనం చేసుకుని ఐదుగురు కేటుగాళ్లు పాస్ పోర్ట్ సీజ్ చేసి విచారణ చేపడుతున్నారు కస్టమ్స్ అధికారులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version