భక్తి: మీ ఉద్యోగం లో అభివృద్ధి ఉండాలంటే ఈ పద్ధతిని అనుసరించండి…!

-

సాధారణంగా ఉద్యోగం లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఉద్యోగం ఉన్నా అభివృద్ధి ఉండదు. చాలా ఏళ్లు గడిచిపోతున్నా సరే చాలా మందికి ఉద్యోగంలో డెవలప్మెంట్ ఉండదు. అలాంటప్పుడు ఇలా ఈ పద్ధతిని అనుసరిస్తే మీ ఉద్యోగంలో అభివృద్ధి రావడానికి తోడ్పడుతుంది. దీని కోసం మీరు 21 సార్లు సూర్య మంత్రాన్ని చదవాలి. ”ఓం పూష్ణే నమః” అని చదువుకోవాలి.

ఇదిలా ఉంటే ఇంక్రిమెంట్ వంటివి వాటిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిహార శాస్త్రం లో చెప్పిన ప్రకారం దేవుడికి దీపం పెట్టి గోధుమ రొట్టె, బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. దీనిని దూడ తో కలిసి ఉన్న ఆవుకి పెట్టాలి. ఇలా చెయ్యడం వలన ఉద్యోగంలో ఇంక్రిమెంట్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఇలా 11 గురువారాలు చెయ్యాలి.

అలానే జన్మ నక్షత్రం నాడు 11 గోమతి చక్రాలని తీసుకుని మారేడు దళం, పచ్చ కర్పూరం, తేనే, పాలు, పంచదార పండితులకి దానం చేస్తే ఉద్యోగం లో అభివృద్ధి ఉంటుంది. అదే మీకు అనుకున్న చోటకి కనుక ట్రాన్స్ఫర్ రావాలంటే… ఐదు ఎర్ర మందారం పూలు, చందనం, ఐదు యాలకులు నీటిలో కలిపి స్నానం చెయ్యండి. ఇలా చేయడం వలన అనుకున్న చోటకి ట్రాన్స్ఫర్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news