నందమూరి తారకరామారావుకి రాజకీయాల్లో సరైన వారసుడు లేడు అని ఇప్పటికీ నందమూరి అభిమానుల్లో ఉన్న భారీ లోటు! అనధికారికంగా వారి మనసులో మాట కూడా! అయితే ఈ లోటును జూనియర్ ఎన్టీఆర్ తీరుస్తారని అంతా భావిస్తున్నా.. దానికి ఇంకా చాలా సమయమే ఉందనేది మరో లోటు! దీంతో బాలయ్యపై రోజు రోజుకీ ఒత్తిడి పెరుగుతుందట!
అవును… ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో బాబు రూము జూము లకు పరిమితమవడం, లోకేష్ తనకు తోచిన రాజకీయం ఏదో తాను చేయడం జరుగుతున్న పరిస్థితి! ఈ పరిస్థితుల్లో గత్యంతరం లేకన్నట్లుగా పార్టీ అధ్యక్ష బాధ్యతలకు కూడా బాలయ్య సరిపోడన్నట్లుగా.. అచ్చెన్నాయుడే దిక్కన్నట్లుగా బాబు స్కెచ్ గీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు నందమూరి వారసులు ఏరి అనే ప్రశ్న బలంగా వినిపిస్తుంది!
ఎందుకంటే.. బాలయ్యను తన రాజకీయ వారసుడు అంటూ ఎన్టీఆర్ ఎపుడో ప్రకటించారు. అయినా కూడా పాతికేళ్లుగా బాబు చేతిలోనే పార్టీ ఉంది! తప్పదన్నట్లుగా బాలయ్యకు ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే ఇచ్చి, ఆ అభిమానుల ఓట్లను పొందగలుగుతున్నారు బాబు! కనీసం మంత్రిగా కూడా బాలయ్యకు ఎలిజిబిలిటీ లేదన్న సంకేతాలు ఇస్తూ! ఆ ఆవేదన బాలయ్యలో ఉందో లేదో తెలియదు కానీ… ఆయన అభిమానుల్లోనూ, అన్నగారి వీరాభిమానుల్లోనూ బలంగా నాటుకుపోయింది!
ప్రతీదానికీ టైం రావాలి అంటారు? మేబీ బాలయ్య కూడా ఆ సమయం కోసమే చూస్తున్నారో ఏమో తెలియదు కానీ… ఇప్పుడు పార్టీ & చంద్రబాబు ఉన్న పరిస్థితుల్లో బాలయ్య కు సువర్ణావకాశం వచ్చింది అంటున్నారు అభిమానులు. ఈ పరిస్థితుల్లో బాలయ్యకు పార్టీ పగ్గాలు అందితే కచ్చితంగా పార్టీకి బలం చేకూరుతుంది.. బాలయ్య కాస్త కష్టపడితే పూర్వవైభవం కూడా వస్తుంది అనేది తమ్ముళ్ల ఆశ!
మరి అన్నగారి కోరికను, ఆయన అన్న మాటను తీర్చే స్థాయిలో బాలయ్య ఆలోచిస్తారా లేక ఇలానే బావచాటు బావమరిదిగా ఉండిపోతారా అన్నది వేచి చూడాలి! పెద్దాయన కడుపున పుట్టిన రుణం తీర్చుకునే అవకాశం ఇది అవుతుందన్న విషయం బాలయ్య ఈ సమయంలో గుర్తించాలి.. అన్నగారి ఆత్మశాంతిస్తుందన్న విషయం గ్రహించాలని కోరుకుంటున్నారు అన్నగారి అభిమానులు!!