ICICI కస్టమర్లకు గుడ్ న్యూస్ : త్వరలో కొత్త సర్వీసులు..!

-

ఎప్పుడు సరోకొత్త సేవలను అందించే ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇప్పుడు తమ కస్టమర్లకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. మీకు ఐసీఐసీఐ బ్యాంక్‌లో అకౌంట్ ఉందా..? అయితే మీకు ఇది శుభవార్తే. ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు ప్రయోజనం కలిగేలా మరిన్ని కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రైవేట్ రంగంలో మంచి పేరు గల ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు తన కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందిస్తున్నారు. తమ కస్టమర్లకు ఉపయోగపడేలా కొత్త సర్వీసులను ఆవిష్కరించింది. వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలను అందుబాటులో తీసుకొచ్చింది. దీంతో బ్యాంక్ ఖాతాదారులకు మరింత లాభం కలుగుతుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్లుకు ఇక మీదట ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లను FD వాట్సాప్ ద్వారానే ఓపెన్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా యుటిలిటీ బిల్లులను కూడా వాట్సాప్ ద్వారా చెల్లించుకునే సౌలభ్యం కలిగిస్తుంది. ట్రేడింగ్ లావాదేవీల వివరాలను కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాట్సాప్ ద్వారా వారు తెలుసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ తాజా సర్వీసులతో పాటు, బ్యాంక్ కస్టమర్లు వారి వాట్సాప్ ద్వారా బ్యాంక్ నుండి 25 రకాల సేవలు పొందొచ్చు అని తెలిపారు. వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సర్వీసుల కారణంగా కస్టమర్లకు కొంత ఊరట కలుగుతుందని ఐసీఐసీఐ బ్యాంక్ హెడ్ డిజిటల్ ఛానెల్స్ అండ్ పార్ట్‌‌నర్‌షిప్ భాస్కర్ మీడియాతో తెలిపారు.

కేవలం ఆరు నెలల కాలంలోనే 20 లక్షలకు పైగా బ్యాంక్ కస్టమర్లు వాట్సాప్ ద్వారా తమ సేవలు పొందుతున్నారని ఆయన తెలిపారు. ఎన్ఆర్‌ఐ, కార్పొరేట్, రిటైల్, ఎంఎస్ఎం కస్టమర్లు ఐసీఐసీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీసులు పొందొచ్చని పేర్కొన్నారు. ఇకపోతే బ్యాంక్ వాట్సాప్ సేవలు పొందాలని భావిస్తే 86400 86400 నెంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలని సూచించారు. ఈ నెంబర్ ఫోన్‌లో సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్‌లోకి వెళ్లి హాయ్ అని మెసేజ్ పెడితే చాలు. తర్వాత బ్యాంక్ నుంచి నేరుగా మీకు రిప్లే వస్తుంది. ఏ సర్వీసులు పొందవచ్చొ మీకు వారు తెలియజేస్తారు. ఆ తర్వాత మీరు ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. గ్యాస్, కరెంటు బిల్లులు, మొబైల్ రీచార్జ్ కూడా చెలించుకోవచ్చు. తమ క్రెడిట్ కార్డు లిమిట్ ఎంత ఉందొ కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version