Good Luck Sakhi: వెనకడుగేసిన మ‌హాన‌టి..!

-

Good Luck Sakhi: బాలీవుడ్ మ‌హాన‌టి కీర్తిసురేశ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. స్టోర్స్ బ్యాక్ డ్రాప్, లేడీ ఒరియెంట్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గ్రామీణ ప్రాంతంలో నుంచి వ‌చ్చిన ఓ మ‌హిళ షూటింగ్ లో త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకుంది. ఎలాంటి అవ‌రోధుల‌ను అధిరోహించింది. అనే కథాంశంతో తెర‌కెక్కింది. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినా.. రిలీజ్ మాత్రం కావ‌డం లేదు.

తాజాగా ఈ సినిమా సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని నవంబర్ 26న విడుదల చేస్తామని గ‌తంలో ప్ర‌క‌టించారు. కానీ, ప‌లు కార‌ణాల‌ను దృష్టిలో పెట్టుకుని.. ఈ చిత్రాన్ని డిసెంబర్ 10న విడుదల చేయనున్న‌ట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇదే స‌మ‌యంలో వివిధ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. దీంతో థియేటర్ల సమస్య ఏర్పాడ‌నున్న‌ద‌ని భావించి.. డిసెంబ‌ర్ 10 న విడుద‌ల చేయాల‌ని
భావిస్తున్నామని చిత్ర‌నిర్మాత‌లు తెలిపారు.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప్రోడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలయిన‌ టీజర్, పోస్టర్లకు ప్రేక్ష‌కుల‌ను మంచి ఆద‌ర‌ణ వ‌చ్చింది. ఈ చిత్రం తెలుగులోనే కాకుండా.. తమిళం, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా డిసెంబ‌ర్ 10 న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news