Good Luck Sakhi : ఎట్టకేలకు థియేటర్లలో విడుద‌ల కానున్న ‘గుడ్ లక్ సఖి.. ఎప్పుడంటే?

-

Good Luck Sakhi : టాలీవుడ్ మహానటి కీర్తి సురేశ్ ప్రధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. స్పోర్ట్స్ బ్యాగ్ డ్రాప్ తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ రైఫిల్‌ షూటర్‌గా నటించింది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. 2019, ఏప్రిల్‌లో నాగేశ్‌ కుకునూర్‌ దర్శకత్వంలో ప్రారంభం అయిన ఈ చిత్రం ఇప్పటి వ‌ర‌కూ ప‌లు కార‌ణాల‌తో వాయిదా ప‌డుతూ వ‌స్తుంది.

ఇక కొద్ది రోజుల క్రితం విడుదల అయిన సినిమా టీజర్‌ కూడా సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. ఎప్పుడెప్పుడూ విడుద‌ల కానున్న‌ద‌ని వేచి చూస్తున్న ప్రేక్ష‌కుల్ని త్వ‌ర‌లోనే పలకరించనుంది. ఈ నెల 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న‌ట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ సినిమాన్ని సుధీర్‌ చంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఆది, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు.

ఇదిలా ఉంటే.. గతేడాది కీర్తి సురేశ్ న‌టించిన పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ చిత్రాలు ఓటీటీలో వేదిక‌గా విడుద‌లై.. ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరచాయి. అందుకే ‘గుడ్​లక్ సఖి’ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని మూవీ మేక‌ర్స్ భావించినట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్.. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అలాగే.. సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా సాగే భోళా శంక‌ర్ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్ర‌లో కీర్తి సురేశ్ న‌టిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version