మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగివస్తున్న మందు ధరలు.. ఎంతంటే… ?

-

లాక్‌డౌన్‌కు ముందు మందుబాబులకు తాగినంత మద్యం దొరికేది.. ఆ తర్వాత కరోనా వల్ల మద్యం షాపులు మూసి వేయడంతో చుక్క దొరక్క ఒక్కొక్కరు చుక్కలు చూశారు.. సమయానికి పెగ్గు వేసుకునే వారి నాలుక పిడచకట్టుకుని పోగా, ఒక్కో తాగుబోతు వింత వింత చేష్టలు చేయడం మొదలు పెట్టారు.. కరోనా వల్ల బాధపడని వారుంటారు కానీ మందు షాపులు మూసివేయడం వల్ల బాధపడని వారు ఉండరు.. దేశంలో చాలమంది ఆ సమయంలో లాక్‌డౌన్‌ని తిట్టుకుని ఉంటారు. ఇకపోతే లాక్‌డౌన్ సడలింపులో మద్యం షాపులు తెరచుకోవడంతో సంతలో తప్పిపోయిన కొడుకును కలుసుకున్న క్షణంలో పడే సంతోషం అంతా ఈ మద్యపాన ప్రియుల్లో కనిపించింది..

మందు షాపులైతే ఒపెన్ అయ్యాయి కానీ ధరలే హైస్పీడ్‌లో పెరిగాయి.. అదేమంటే కరోనా కరువు అంటారు.. ఇక మద్యం ధరలు పెరిగినప్పటి నుండి తాగుబోతులు కూడా అడ్జస్ట్ అవడానికి సిద్దపడుతున్నారు.. దీనితో అమ్మకాలు భారీగా పడిపోయాయని కేజ్రీవాల్ సర్కారు మద్యంపై విధించిన కరోనా స్పెషల్ ఫీజును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఈ నెల పది నుంచి అమల్లోకి రానుంది. కాగా నెల క్రితం ఢిల్లీలో మద్యంపై 70 శాతం కరోనా స్పెషల్ ఫీజు విధించడంతో ధరలు విపరీతంగా పెరిగాయి.

 

దీంతో ప్రారంభంలో మద్యం అమ్మకాలు పెద్ద ఎత్తున జరిగినా ధరలు ఎక్కువగా ఉండటంతో తర్వాత తగ్గిపోయాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కరోనా స్పెషల్ ఫీజును తొలగించింది. కాగా మద్యంపై వ్యాట్ మాత్రం 20 నుంచి 25 శాతానికి పెంచారు. ఇకపోతే మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా త్వరలోనే మద్యం ధరలను తగ్గించే అవకాశముంది. ఇదేగనుక జరిగితే తాగుబోతులకు పండగే.. అసలే చుక్క చుక్కకు చుక్కలు చూపిస్తున్నా మందు మానక ఎలాగో తిప్పలుపడి తాగుతున్న తాగుబోతులు ధరలు తగ్గితే అయినా సంతోషంగా కాస్త ఒక చుక్క ఎక్కువేస్తారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version