ఏపీ ఎన్జీవోలకు గుడ్ న్యూస్… హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం

-

ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభ వార్త తెలిపింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ నెలాఖరులో అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. ఈ మేరకు వారితో చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ ఎన్జీవోలు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ఎన్జీవోలు శుక్రవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన చంద్రబాబు ఈ నెలాఖరులో ఉద్యోగులతో భేటీ అవుతానని చెప్పినట్లు ఎన్జీవోలు వెల్లడించారు. ఉద్యోగుల ప్రభుత్వం ఏర్పడిందని హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తాము కూడా కోరుకున్నామని , ఉద్యోగుల డిమాండ్లను చంద్రబాబు పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు, ఉద్యోగులకు ఇచ్చిన వాగ్ధానాలను చంద్రబాబు నెరవేర్చుతారనే నమ్మకం తమకు ఉందని ఆంధ్ర ప్రదేశ్ ఎన్జీవోలు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version