ఆస్తమా రోగులకు గుడ్ న్యూస్

-

కరోనా వైరస్ ఆస్తమా రోగులకు చాలా తక్కువగా సోకే అవకాశాలు ఉన్నాయని… ఒక అధ్యయనం వెల్లడించింది. నవంబర్ 24 న ది జర్నల్ ఆఫ్ అలెర్జీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడి అయింది. ఉబ్బసం ఉన్న రోగుల్లో కరోనా బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంది, వారి ప్రాణాలకు కూడా తక్కువ ముప్పు ఉంది అని పేర్కొన్నారు.

ఇజ్రాయిల్ సహా మూడు దేశాల్లో ఈ పరిక్షలు నిర్వహించారు. ఫిబ్రవరి నుండి జూన్ 2020 వరకు ఈ పరిక్షలు నిర్వహించారు. ఆర్‌టి-పిసిఆర్ పరీక్షలను ఉపయోగించి మొత్తం 37,469 మందికి ఈ పరిక్షలు చేసారు. వారిలో ఉబ్బసం ఉన్న వారికి కరోనా సోకలేదు అని ఈ పరీక్షల్లో వెల్లడి అయింది. ఇతర శ్వాస సమస్యలు ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు రానున్నాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version