రుణ గ్రహీతలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తాజాగా ఈ బ్యాంక్ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనితో బ్యాంక్ రుణ గ్రహీతలకు కాస్త ఊరట కలుగనుంది. అంతే కాదు వాళ్లకి ఈఎంఐ భారం తగ్గనుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే…. ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో కస్టమర్స్ కి కూడా ఊరట కలిగింది. ఈ బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు MCLR ని తగ్గిస్తున్నట్టు చెప్పింది.
అంతే కాదండి లోన్ ఈఎంఐ చెల్లించే వారికి కూడా ప్రయోజనం కలుగొచ్చు. ఈఎంఐ భారం దిగిరావొచ్చు. అలానే హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఇతర రుణాలపై రుణ రేట్లు బాగాతగ్గాయి. రేట్ల తగ్గింపుతో ఒక రోజు ఎంసీఎల్ఆర్ 8.25 శాతానికి, నెల రోజుల ఎంసీఎల్ఆర్ 8.3 శాతానికి, 3 నెలల ఎంసీఎల్ఆర్ 8.35 శాతానికి తగ్గింది. అలానే ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.5 శాతానికి, ఏడాది ఎంసీఎల్ఆర్ 8.6 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.95 శాతానికి దిగొచ్చింది.