నూతన బార్ పాలసీ ప్రకారం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 840 బార్లకు నోటిఫికేషన్ విడుదల చేయగా…. ఇందులో 10% (84 బార్లు) గీత కార్మికులకు ఎక్సైజ్ శాఖ కేటాయించింది. ఈనెల 26వ తేదీ వరకు ఆఫ్లైన్, ఆన్లైన్ లో దరఖాస్తులను స్వీకరించి 28వ తేదీన లాటరీ ద్వారా విధానం ద్వారా ఎంపిక చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త పాలసీ విధానం అమలులోకి రానుంది. దరఖాస్తు ఫీజు రూ. 5 లక్షలు కాగా… బార్ల లైసెన్స్ ఫీజు జనాల ఆధారంగా రూ. 35 నుంచి 75 లక్షలుగా ఉంది. లాటరీ గెలిచిన వారికి బార్ లను కేటాయిస్తారు. అయితే వైసిపి ప్రభుత్వంలో పర్మిట్ రూమ్ లను తొలగించారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్మిట్ రూమ్ లకు అనుమతులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై వైసిపి నాయకులు ఫైర్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చుతున్నారని చంద్రబాబు నాయుడుపై వైసిపి నేతలు ఫైర్ అవుతున్నారు.