ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ మాజీ మంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తు కొన్ని విషయాలను చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో INDI కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి తమ మద్దతు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ లను రేవంత్ రెడ్డి కోరుతున్నారు. కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు వ్యక్తి ఎంపిక కావడం మన రాష్ట్రాలకు నిజంగా గర్వకారణమని రేవంత్ రెడ్డి అన్నారు. సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని అన్నారు.

రాజకీయాలకు అతీతంగా సహకరించాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, కేసిఆర్, అసాద్ లకు విజ్ఞప్తి చేస్తున్నానని ప్రెస్ మీట్ లో భాగంగా రేవంత్ రెడ్డి అన్నారు. కాగా, ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కాదని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన INDI కూటమి ప్రతిపాదించిన లాయర్ అని అన్నారు. సుదర్శన్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల కోసం ఎంతగానో కృషి చేశారు. రాజ్యాంగ పరిరక్షకుడిలా ఆయన వ్యవహరించారని అన్నాడు. బీసీ బిల్లు ఆమోదం పొందాలంటే న్యాయ కోవిదుడు కీలక పదవిలో ఉండాలి. NDA అభ్యర్థి రాధాకృష్ణన్ గెలిచినట్లయితే బీసీలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.