రైతులకు గుడ్ న్యూస్: కుసుమ్ స్కీమ్ తో అదిరిపోయే రాబడి..!

-

కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని 2022 నాటి కల్లా రెట్టింపు చేయాలనే ముఖ్య లక్ష్యంతోనే కేంద్రం చర్యలను చేపడుతుంది. ఇందులో భాగంగానే అన్నదాతల సంక్షేమం కోసం పలు రకాల స్కీమ్స్ అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఇందుకు మంచి ఉదాహరణ. మోదీ సర్కార్ ఈ స్కీమ్ ఒక్కటే కాకుండా మరో అదిరిపోయే స్కీమ్‌ ను కూడా ఇప్పుడు అందిస్తోంది. అదే సోలార్ స్కీమ్ అంటే కుసుమ్ స్కీమ్. ఈ పథకంలో రైతులు వారి పొలంటో సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకొని మంచి ఆదాయం పొందొచ్చు. సోలార్ కంపెనీలు దీనికి గానూ రైతులకు అద్దె చెల్లిస్తాయి. లేదంటే మీరే సోలార్ కరెంట్‌కు కంపెనీలకు విక్రయించుకొని మంచి ఆదాయం పొందొచ్చు. రైతులు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తే వారికీ ఆర్థిక సాయం కూడా అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

రైతులు వారి పొలాన్ని సోలార్ ప్యానెల్స్ కోసం కంపెనీలకు అద్దెకు ఇస్తే, కంపెనీలు ఏకరానికి రూ.లక్ష వారికీ చెల్లిస్తాయి. అయితే దీనికి అగ్రిమెంట్ కూడా ఉంటుంది. 25 ఏళ్ల పాటు పొలాన్ని కంపెనీలకు అద్దెకు ఇవ్వాలి. అంటే కంపెనీలు మీకు 25 ఏళ్ల పాటు సోలార్ ప్యానెల్స్ కోసం అద్దె చెల్లిస్తూనే ఉంటాయి. 25 ఏళ్ల తర్వాత రైతులకు ఏకరానికి రూ.4 లక్షల అద్దె లభిస్తుంది. అయితే ఇక్కడ రైతులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు.

పీపీపీ మోడల్ కింద కంపెనీలు ఇంకా ప్రభుత్వం కలిసి సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తాయి. సోలార్ ప్యానెల్స్ నేల నుంచి 3.5 మీ. ఎత్తులో ఉంటాయి. అందువల్ల రైతులు వీటి కింద పంట సాగు చేసుకోవచ్చు. ఎకరా పొలానికి మళ్లీ రైతులకు 1000 యూనిట్ల కరెంటు ఉచితంగా లభిస్తుంది. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుమ్ స్కీమ్‌ ను అందిస్తోంది. ఇందులో భాగంగా అన్నదాతలు సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. దీని వల్ల అదిరిపోయే రాబడి పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version