జబర్దస్త్ లాంటి టాప్ రేటింగ్ షో వదిలేసి అవినాష్ ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం తో అందరూ షాక్ అయ్యారు అనే విషయం తెలిసిందే. చేతినిండా అవకాశాలు పెట్టుకుని అవినాష్ బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వచ్చాడు.. జబర్దస్త్ నుంచి అవినాష్ ను పంపిం చేశారా అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఆ తర్వాత ఈ టాక్ కాస్త సద్దుమణిగింది కానీ ఇటీవలే అవినాష్ మాట్లాడిన తీరు చూస్తే మాత్రం ఇక జబర్దస్త్ లో అవినాష్ ప్రస్థానం ముగిసింది అన్నది అర్ధమవుతుంది.
నామినేషన్స్ తర్వాత ఏడుస్తూ కూర్చున్న అవినాష్ ను అరియానా పక్కనే ఉండి ఓదార్చింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను పాత విషయాలు గుర్తొచ్చి ఏడుస్తున్నాను అంటూ చెప్పాడు. పాత విషయాలంటే ఏమిటి అని అడుగగా నన్ను ఆ షో నుంచి పంపించేసారు అంటూ అవినాష్ మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది జబర్దస్త్ నుంచి పంపించేశారా అన్న చర్చ మొదలయింది.