రైతులకు శుభ వార్త….. కీలక నిర్ణయం తీసుకున్న మోడీ ప్రభుత్వం..

-

డిమాండ్ల సాధన కోసం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకో వైపు కేంద్ర ప్రభుత్వం రైతులకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయంతో రైతులకు ఎంతో మేలు జరుగనుంది. ఈ ఏడాదికి గాను పీడీఎం(పొటాష్ డెరైవ్డ్ ఫ్రమ్ మొలాసిస్) ధరలను టన్నుకు రూ. 4,263 గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

దీనికి సంబంధించి చక్కెర కర్మాగారాలు, ఎరువుల కంపెనీల మధ్య ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.తయారీదారులు ఎరువుల శాఖకు సంబంధించి ‘న్యూట్రియంట్స్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్’ కింద టన్నుకు రూ.345 సబ్సిడీని క్లెయిమ్ చేయవచ్చునని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతో.. ఎరువుల కంపెనీలు, యూనిట్లు ఈ సబ్సిడీ తుది వినియోగదారైన రైతులకు అందిస్తే.. రైతులకు తక్కువ ధరకే ఎరువులు లభించనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version