చేనేత కార్మికులకు శుభవార్త.. వివిధ పథకాలకు రూ.73.5 విడుదల

-

చేనేత కార్మికులకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. చేనేత మరియు జౌళి రంగాల  అభివృద్ధి కొరకు ప్రభుత్వము చేపట్టిన వివిధ పధకాలు వాటి అమలు పై ఇవాళ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు.. ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చిన పలు అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే చేనేత కార్మికులకు సంభందించిన పథకాల అమలుకు ఏకంగా రూ . 73.5 కోట్లు విడుదల విడుదల చేసింది తెలంగాణ సర్కార్.

చేనేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆ ర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగాన్ని సంస్థాగతంగా మరియు నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకువెళ్ళటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రాయోజిత పథకాలను రూపొందించి అమలు చేస్తున్నదని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అనేక వినూత్న కార్యక్రమాల ద్వారా చేనేత రంగంలోని నేత కార్మికులు మరియు అనుబంధ కార్మికుల యొక్క నెలసరి ఆదాయాలను పెంపొందించి వారి యొక్క జీవన ప్రమాణాలను అభివృద్ధి పరచడం జరుగుతున్నదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version