ఒక్కోసారి రైళ్లు ఖాళీయే వుండవు. రైళ్లు ఫుల్ అయ్యిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు కన్‌ఫామ్ టిక్కెట్లు దొరకవు. అలాంటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు వస్తే ప్రయాణికులు ఇబ్బుందులు పడుతూ ఉండాలి. అయితే ఆర్ఏసీ టిక్కెట్లను మరియు వెయిటింగ్ లిస్ట్ ని కన్ఫర్మ్ చెయ్యడానికి రైల్వే సరికొత్త టెక్నాలజీని తీసుకు రావడం జరిగింది.
హ్యాండ్-హెల్డ్ టర్మినల్స్ ద్వారా గత నాలుగు నెలల్లో రోజుకు 7 వేల మంది కన్ఫర్మ్ అవ్వని టికెట్స్ ని కన్‌ఫామ్ చేసింది. వీటిని రియల్ టైమ్ బేసిస్‌లోనే కన్ఫర్మ్ చేసారు. అలానే ఎవరైనా టికెట్స్ ని రిజర్వేషన్ చేసుకుని చివరి క్షణంలో రద్దు చేసుకున్నా లేదా రాలేకపోయినా అవి హెచ్‌హెచ్‌టీ డివైజ్‌లో కనపడతాయి.
ప్యాసెంజర్ లేదా ఆర్ఏసీ ప్యాసెంజర్‌కి ఆ సీట్లను ఇచ్చేలా చేసింది. హెచ్‌హెచ్‌టీ డివైజ్ అనేది ఐప్యాడ్ సైజులో ఉంటుంది. ప్యాసెంజర్ ఛార్ట్‌లతో ప్రీలోడ్ అయి ఉంటుంది. టిక్కెట్ చెకింగ్ స్టాఫ్ డైరెక్ట్ ఆ ఈ డివైజ్ ద్వారా రియల్ టైమ్ అప్‌డేట్లను చెక్ చేసేందుకు అవుతుంది. అలానే ప్రయాణికుల నుంచి అదనపు ఫీజులను, జరిమానాలను, ఇతర ఛార్జీలను వసూలు చేసేందుకు కూడా ఇవి వాడచ్చు.
డిజిటల్ పేమెంట్స్ ఆప్షన్స్ తో ఈ చార్జెస్ ని కలెక్ట్ చెయ్యచ్చు. రసీదులు కలెక్ట్ చేయడానికి కూడా వీటిని వాడడానికి అవుతుంది. టిక్కెట్ల జారీ, సీట్ల జారీలో అక్రమాలను తగ్గించడం కోసం కూడ ఇది ఉపయోగ పడుతుంది. రైళ్లలో కూడా మహిళలకు ప్రత్యేక సీట్లను ఇప్పుడు కేటాయించడం జరుగుతోంది.