తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 1,435 కోట్లు చెల్లించామని అధికారులు పేర్కొన్నారు. నిన్న 13,841 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ. 146.30 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల ఇంటి పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. 1.29 లక్షల ఇళ్లు పురోగతిలో ఉన్నాయని స్పష్టం చేశారు.

కాగా, రేవంత్ రెడ్డి ఈ పథకం ద్వారా చాలామంది నిరుపేదలకు అండగా ఉండి ఇంటికలను సాకారం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు కొంతమంది పేద ప్రజలకు మాత్రమే ఇంటి కల తీరబోతోంది. మరి కొంతమంది ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులు అయ్యారు. ఇవి మాత్రమే కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో అనేక రకాల సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకువచ్చారు. తెలంగాణను మరింత అభివృద్ధి చేసే దిశగా ముందడుగు వేస్తున్నారు.