The Kashmir Files : కాశ్మీర్ ఫైల్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వ‌ర‌లోనే తెలుగులోకి అనువాదం

-

త‌క్కువ రోజుల్లోనే ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకున్న కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల క‌లెక్షన్లు చేసి ఔరా అనిపించింది. ఏ ఒక్క రాష్ట్రానికి ప‌రిమితం కాకుండా.. దేశ వ్యాప్తంగా అన్ని భాషల ప్ర‌జ‌లు ది కాశ్మీర్ ఫైల్స్ ను ఆద‌రిస్తున్నారు. కాగ ఈ సినిమాను వివేక్ అగ్ని హోత్రి తెర‌కెక్కించ‌గా.. తెలుగు నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్ ఈ సినిమా నిర్మించారు. కాగ ఈ సినిమా మార్చి 11న చిన్న సినిమాగా విడుద‌ల అయింది. కాగ కొద్ది రోజుల్లోనే సినిమా క్రేజ్ పెరిగి… పాన్ ఇండియా సినిమాగా ఎదిగింది.

90వ ద‌శకంలో క‌శ్మీర్ లో పండిట్ ల‌పై జ‌రిగిన హత్య కాండ ను క‌థగా ఎంచుకుని ఈ సినిమాను తెర‌కెక్కించారు. కాగ ఈ సినిమా తెలుగు ఫ్యాన్స్ కు నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్ గుడ్ న్యూస్ చెప్పారు. అతి త్వ‌ర‌లోనే తెలుగు లోకి అనువాదం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో త్వ‌ర‌లో తెలుగు లో కూడా ది కాశ్మీర్ ఫైల్స్ సంద‌డి చేయ‌నుంది. కాగ ఇప్ప‌టికే ఈ సినిమాను వెబ్ సిరీస్ గా తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు డైరెక్ట‌ర్ వివేక్ అగ్ని హోత్రి కూడా ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version