ప్రయాణికులకు గుడ్ న్యూస్…ఇకపై రైళ్లలో ఫుడ్ డెలివరీ

-

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.రైల్వే ప్రయాణికులకు ఇకపై మెరుగైన ఫుడ్ అందనుంది. వారికి కావాల్సిన ఆహారాన్ని నచ్చిన రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఐఆర్సీటీసీ, స్విగ్గీ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. మార్చి 12 నుంచి ఈ సేవలు వైజాగ్, విజయవాడ, బెంగళూరు,భువనేశ్వర్ స్టేషన్లలో అందుబాటులోకి రానున్నాయి. ఐఆర్సీటీసీ యాప్ లోనే ఫుడ్ను ఆర్డర్ చేసి ప్రయాణికులు కావాల్సిన స్టేషన్లో పొందవచ్చు.

రాబోయే ఆరు నెలల్లో 59కి పైగా స్టేషన్‌లకు ఈ సేవలను విస్తరించాలని కంపెనీ చూస్తోంది.స్విగ్గీతో ఒప్పందం ద్వారా ప్రయాణికులు మరింత మెరుగైన ప్రయాణ సౌకర్యాలను పొందనున్నారు.పీఎన్ఆర్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా కావాల్సిన ఆహారం స్టేషన్‌లో డెలివరీ తీసుకోవచ్చు అని ఐఆర్‌సీటీసీ ఛైర్మన్, ఎండీ సంజయ్ కుమార్ జైన్ తెలిపారు. ఈ కొత్త సేవలను ప్రయాణికులు ఇష్టపడతారని భావిస్తున్నట్టు స్విగ్గీ సీఈఓ రోహిత్ కుమార్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news