పురపాలికల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పారిశుద్ధ్య కార్మికులకు ఇప్పుడు ఉన్న వేతనాలకు 30 శాతం వేతనాలు పెరగనున్నాయి. గత ఏడాది జూన్ 1 వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అంతే కాకుండా దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను రాష్ట్ర పురపాలక శాఖ జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,804 మంది పారిశుద్ధ్య కార్మికులకు మేలు జరగనుంది. కాగ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పురపాలిక పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచుతామని ఇప్పటికే హామీ ఇచ్చింది. ఆ హామీని తాజా గా రాష్ట్ర ప్రభుత్వం అమలు చూస్తు నిర్ణయం తీసుకుంది. కాగ ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగులు అందరికీ 30 శాతం వేతనాలు పెంచింది. ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులకు కూడా పెంచింది.