రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. బోనస్ డబ్బుల చెల్లింపునకు డేట్ ఫిక్స్ చేసింది.అక్టోబర్ 9న సింగరేణి కార్మికుల అకౌంట్లలో బోనస్ డబ్బులు జమ కానున్నాయి. ఈ మేరకు సింగరేణి ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇటీవల 33 శాతం బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే.
సింగరేణి సంస్థ 2023- 24 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో భాగంగా 33 శాతం బోనస్ ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.2023-24 ఏడాదిలో సింగరేణికి రూ. 4,701 కోట్లు లాభం వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో దసరా పండుగ ముందు కార్మికులకు లాభాల్లో 33 శాతం అనగా, మెుత్తం రూ.796 కోట్లను లాభాల వాటాగా కార్మికులకు బోనస్ చెల్లించనున్నట్లు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.