తెలంగాణ గ్రామపంచాయతీలకు శుభవార్త

-

తెలంగాణ గ్రామపంచాయతీలకు శుభవార్త చెప్పింది కేసీఆర్‌ సర్కార్‌. ఇవాళ గ్రామపంచాయతీల పెండింగ్‌ బిల్లులు విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు రూ.వెయ్యి కోట్ల పెండింగ్‌ బిల్లులు ఉన్నాయి. పెండింగ్‌ బిల్లులు అన్నీ విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది.

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డిసిపి మెంబర్లుగా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version