తెలంగాణ టీచర్లకు గుడ్‌న్యూస్..ఈ నెల 28 నుంచే దరఖాస్తుల స్వీకరణ

-

తెలంగాణ రాష్ట్ర టీచర్లకు గుడ్‌న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు ఆన్లైన్ లో ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఆ తర్వాతే పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. బదిలీల కోసం ఆప్షన్ ఎంచుకున్న తర్వాత వాటి సవరణకు ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఒక రోజు పాటు అవకాశం ఇస్తారు. కాగా, ఈ బదిలీల ప్రక్రియ కారణంగా ఏకంగా 9600 మంది టీచర్లకు లబ్ది చేకూరనుందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version