ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. నేటి నుంచి రెండో ఫ్రీ సిలిండర్ ఇవ్వనున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ‘దీపం–2’ పథకం కింద రెండో ఫ్రీ సిలిండర్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
నేటి (మంగళవారం) నుంచి రెండో విడత కొత్త సిలిండర్ కోసం దరఖాస్తు స్వీకరించనుంది. ఏప్రిల్ నుంచి జులై 31 మధ్య మరో ఉచిత సిలిండర్ అందించనుంది. ఉచిత సిలిండర్‌తో సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గనుంది. తొలి విడతలో 90 లక్షల ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసింది.