విశాఖ వాసులకు శుభవార్త… రైల్వే జోన్ కార్యాలయ ఏర్పాటుకు ప్రక్రియ మొదలైంది. విశాఖ లో రైల్వే జోన్ కార్యాలయ ఏర్పాటు కి మొదలైన ప్రక్రియ మొదలైనట్లు అధికారులు ప్రకటన చేశారు. తాజాగా విశాఖలో రైల్వే జోనల్ కార్యాలయ భవన నిర్మాణానికి టెండర్లు పిలిచింది భారత రైల్వే శాఖ. వచ్చే నెల 27 తో టెండర్లు దాఖలు గడువు…కూడా ముగియనుంది.
జిఎం కార్యాలయం సహా ఇతర పరిపాలన భవనాల నిర్మాణం చేపట్టనుంది రైల్వే శాఖ. రెండేళ్ల లో భవనాలు పూర్తి చేయాలని టెండర్లు లో నిబంధనలు పెట్టింది రైల్వేశాఖ. విశాఖ రైల్వే జోన్ కు భూ కేటాయింపు తాత్సారం చేసినట్లు జగన్ పై టీడీపీ పార్టీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం రాగానే యుద్ధ ప్రాతిపదికన భూ కేటాయింపులు చేసినట్లు నేతలు అంటున్నారు. ఈ తరుణంలోనే చంద్రబాబు కూటమి ప్రభుత్వం చొరవతో విశాఖ రైల్వే జోన్..పట్టాలెక్కుతోందట.