తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి శుభవార్త అందింది. నెలవారి కోటా రేషన్… ఈనెల నుంచి పునః ప్రారంభం అయింది. తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ నెల రేషన్ పంపిణీ కొనసాగుతోంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ మాసంలో ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే మరోసారి ఈ నెల నుంచి పాత పద్ధతిలో నెలవారి కోటాను రేషన్ దుకాణాల డీలర్లు పంపిణీ చేస్తున్నారు.

అయితే ఇలాంటి నేపథ్యంలో కొత్తగా రేషన్ కార్డు దక్కించుకున్న వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది ప్రభుత్వం. జూలై అలాగే ఆగస్టు మాసంలో కొత్త రేషన్ కార్డులు పొందిన వారు ఈ నెల నుంచి సన్నబియ్యం… తీసుకు వెళ్ళవచ్చు. ఈనెల 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ కొనసాగనుంది. మొత్తం 3.2 కోట్ల మంది లబ్ధిదారులకు 2.02 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని.. ప్రభుత్వం కేటాయించడం జరిగింది.