పేటీఎం వాడే వారికి గుడ్ న్యూస్.. వడ్డీ లేకుండా రూ.60 వేలు.. ఇలా లిమిట్ పెంచచ్చు..!

-

పేటీఎం ని వాడే వారికి గుడ్ న్యూస్. డిజిటల్ పేమెంట్స్ దిగ్గజ కంపెనీ పేటీఎం కస్టమర్లకు గుడ్ న్యూస్ ని చెప్పింది. పేటీఎం పోస్ట్ పెయిడ్ సర్వీసులు ఉపయోగించే వారికి బాగా బెనిఫిట్ కలగనుంది. దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఇన్‌స్టంట్ క్రెడిట్ లిమిట్‌ను పెంచుకునే వెసులుబాటు ఇస్తోంది పేటీఎం.

పేటీఎం పోస్ట్ పెయిడ్ ద్వారా స్మాల్ టికెట్ ఇన్‌స్టంట్ లోన్స్ ని కస్టమర్స్ పొందవచ్చు. ఈ డబ్బుని ఇంటి ఖర్చుల కోసం వాడుకోచ్చు. అలానే స్టోర్స్ లో షాపింగ్ కూడా చెయ్యచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా కొనుగోలు చెయ్యచ్చు. ఈ సేవల కోసం పేటీఎం ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌తో జతకట్టింది.

అయితే కస్టమర్స్ పేటీఎం పోస్ట్ పెయిడ్ కింద రూ.60 వేల వరకు క్రెడిట్ లిమిట్ పొందొచ్చు. దీనితో షాపింగ్ లేదా స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు. పైగా వడ్డీ కూడా పడదు. కానీ 30 రోజులలోగా మళ్లీ తిరిగి చెల్లించేయాలి.

పోస్ట్ పెయిడ్ సర్వీసుల యాక్టివేషన్ కోసం పేటీఎం ఎలాంటి వార్షిక, యాక్టివేషన్ చార్జీలను వెయ్యలేదు. కన్వీనియన్స్ ఫీజు మాత్రం స్వల్పంగా ఉంటుంది. నెల రోజుల్లో చెల్లించలేకపోతే మాత్రం అప్పుడు చార్జీలు చెల్లించాలి. ఇక ఈ పోస్ట్ పెయిడ్ ఎలా యాక్టివేట్ చెయ్యాలో కూడా చూద్దాం.

ముందుగా పేటీఎం యాప్‌లోకి వెళ్లాలి.

  • మై పేటీఎం అనే సెక్షన్‌లో పేటీఎం పోస్ట్ పెయిడ్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి.
  • కనపడకపోతే సెర్చ్ బార్‌లో పేటీఎం పోస్ట్ పెయిడ్ అని టైప్ చేసి చూడండి.
  • నెక్స్ట్ మీరు మీ పాన్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చెయ్యండి.
  • ఫుల్లీ డిజిటల్ కేవైసీ ప్రాసెస్ ద్వారా కొన్ని నిమిషాల్లోనే మీ క్రెడిట్ లిమిట్ ఎంతో తెలిసిపోతుంది.
  • ఒకసారి ఒకే చేస్తే చాలు. పేటీఎం పోస్ట్ పెయిడ్ యాక్టివేట్ అయిపోతుంది.
  • గరిష్టంగా రూ.60 వేల వరకు లిమిట్ వస్తుంది. కొందరికి తక్కువే రావొచ్చు. అలానే లిమిట్ కూడా మారుతూ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news