తెలంగాణ రాష్ట్రంలోని వీఆర్వోలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీఆర్వోలు కోరుకునే విధంగా పలు శాఖల్లోకి సర్ధుబాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫైల్ పై సీఎం కేసీఆర్ కూడా సంతకం చేసి ఆమోదించినట్టు సమాచారం. కాగ రాష్ట్ర ప్రభుత్వం.. ధరణి పోర్టల్ తీసుకువచ్చిన తర్వాత వీఆర్వోలకు పని ఉండదని.. వీఆర్వో వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వోలు అందరూ కూడా ఖాళీగానే ఉన్నారు. కొంత మందిని పలు శాఖల్లోకి మార్చినా.. చాలా మంది ఖాళీగానే ఉన్నారు. అయితే ప్రస్తుతం వారిని పలు శాఖల్లో సర్చుబాటు చేయడనాకి సర్కార్ ముందుకు వచ్చింది. అయితే వీఆర్వోలు.. తమను రెవెన్యూ శాఖలోనే ఉంచాలని గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు సమాచారం.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,485 మంది వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో తో పాటు ఇతర శాఖల్లోకి సర్ధుబాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. పట్టణాభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్, పురపాలక శాకల్లోనూ సర్ధుబాటు చేసే అవకాశం ఉంది. కాగ సీనియారిటీ బట్టీ సర్ధుబాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాకాలు చేస్తోంది.