ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి అదిరిపోయే శుభ వార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ ద్విచక్ర వాహనాలను అందించే పథకాన్ని పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ ప్రారంభించింది. దీనికోసం 17 వాహన తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఓలా, ఆథర్, బిగాస్, కైనెటిక్, టీవీఎస్, హీరో వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, అప్కాబ్, ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ ఆర్థిక సహకారం అందిస్తాయి. ఏడాదిలో కనీసం లక్ష వాహనాలను అందించాలన్నదే లక్ష్యమని ఒక అధికారి తెలిపారు. విద్యుత్ వాహనాల కోసం 26 జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేకంగా యాప్ ను నెడ్ క్యాప్ అందుబాటులోకి తెచ్చింది. వాహనాలకు రుణాలను అందించడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక శాఖను విజయవాడలో ఏర్పాటు చేస్తుంది.