డెలివరీ డేట్ ఎప్పుడో కూడా మీరే చెప్పండి అంటున్న నిక్కీ గల్రాని..!!

-

ఆది పినిశెట్టి భార్యా ప్రముఖ హీరోయిన్ నిక్కీ గల్రాని గర్భం దాల్చినట్టు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఈ విషయంపై నిక్కీ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. ” నేను ప్రెగ్నెంట్ అన్న వార్తలను కొంతమంది వైరల్ చేస్తున్నారు.. అయితే డెలివరీ డేట్ కూడా మీరే చెప్పేయండి” అంటూ నవ్వుల ఎమోజిని పెట్టింది. “ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్ ని కాదు.. కానీ దీన్ని భవిష్యత్తులో తప్పకుండా బ్రేక్ చేస్తా ..దయచేసి రూమర్లు నమ్మకండి” అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేసింది.

నిక్కి కృష్ణాష్టమి, మలుపు తదితర చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ కన్నడ ముద్దుగుమ్మ ఆది పినిశెట్టిని ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది మే లో వివాహ బంధంతో ఒక్కటయింది. మొత్తానికైతే తాను గర్భవతి అన్న వార్తలపై క్లారిటీ ఇచ్చి రూమర్లకు గట్టిగా కౌంటర్ ఇచ్చింది నిక్కీ గర్లాని. ఇకపోతే ఆది పినిశెట్టి విషయానికి వస్తే.. ప్రస్తుతం హీరోగా నుంచి విలన్ గా తన అవతారాన్ని మార్చుకొని మరింత పాపులారిటీని దర్శించుకుంటున్నాడు. ఇటీవల నటించిన దివారియర్ సినిమాతో ఆది పినిశెట్టికి మంచి గుర్తింపు లభించిందని చెప్పాలి.

హీరోగా కూడా మరకతమణి తోపాటు మరెన్నో సినిమాలలో నటించి మరింత పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇప్పుడు విలన్ గా అవతారం ఎత్తి మరింత పాపులారిటీని దక్కించుకుంటున్నాడు. ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలలో బిజీగా ఉంటూ మరింత స్టార్ ఇమేజ్ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆది పినిశెట్టి. ఇకపోతే వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉన్న నిక్కీ గర్లని మంచి పాత్ర దొరికితే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి నిరభ్యంతరం లేదు అంటూ కూడా తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version