ఏపీ ప్రజలకు శుభవార్త : 2.62 లక్షల టిడ్కో ఇళ్ల పంపిణీ

-

అమరావతి : టిడ్కో గృహాల పనుల పురోగతి, బ్యాంకు రుణాల మంజూరు తదితర అంశాలపై పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ ఇవాళ టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, టిడ్కో ఎండి శ్రీధర్, మెప్మా ఎండి విజయలక్ష్మి, ఇతర అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… రెండు వారాల్లో పూర్తి అయిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నామని పేర్కొన్నారు. ఈ కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పనులు వేగంగా జరుగుతున్నాయని అని పేర్కొన్న బొత్స సత్యనారాయణ… 300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇళ్లు/ఫ్లాట్లను ఉచితంగా అందచేయనున్నామని గుర్తు చేశారు.

అగ్రిమెంట్‌ కుదుర్చుకున్న లబ్దిదారులకు బ్యాంకు రుణాల మంజూరులో టిడ్కో, మెప్మా, బ్యాంకుల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఇక పై ప్రతి వారం టిడ్కో హౌసింగ్ పురోగతి పై సమీక్ష చేస్తానని స్పష్టం చేశారు. సుమారు 2.62 లక్షల ఇళ్ల పనులు వేగవంతం అవుతున్నాయని.. వాటిని త్వరలోనే పంపిణీ కూడా చేస్తామని చెప్పారు బొత్స సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news