డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసిన విద్యార్థులకి గుడ్ న్యూస్…!

-

మీరు డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత పార్లమెంట్ రాజ్యసభ లో ఇంటర్న్‌షిప్, ఫెలోషిప్ ప్రకటించింది. రాజ్యసభ స్టూడెంట్ రీసెర్చ్ అండ్ స్టడీ స్కీమ్-RSRS దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. డీఎస్ రాధాకృష్ణన్ చెయిర్ ఫెలోషిప్, స్టూడెంట్ ఎంగేజ్‌మెంట్ ఇంటర్న్‌షిప్‌కు డిగ్రీ లేదా పీజీ పాస్ అయిన విద్యార్థులు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. కనుక ఈ విషయాన్నీ విద్యార్థులు తెలుసుకోవాలి. అప్లై చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ.

 

 

దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… ఫెలోషిప్ మొదట రెండేళ్లు ఉంటుంది. అది అయ్యాక మరో ఏడాది ఎక్స్టెండ్ చేస్తారు. ఇంటర్న్‌షిప్ మొదట 18 నెలలు ఉంటుంది. ఆ తర్వాత మరో 6 నెలలు పొడిగిస్తారు. ఇది ఇలా ఉంటే ఫెలోషిప్ గ్రాంట్ ఏడాదికి రూ.8,00,000 లభిస్తుంది. అలానే రూ.50,000 కాంటింజెన్సీ గ్రాంట్ కూడా వస్తుంది. ఇంటర్న్‌షిప్‌కు నెలకు రూ.10,000 లభిస్తుంది. చివరగా సర్టిఫికెట్ కూడా వస్తుంది.

విద్యార్థులు https://rajyasabha.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి ఇమెయిల్ ద్వారా పంపాలి. అలానే రాజ్యసభ ఫెలోషిప్ దరఖాస్తుల్ని rksahoo.rs@sansad.nic.in మెయిల్ ఐడీకి, ఇంటర్న్‌షిప్ దరఖాస్తుల్ని rssei.rsrs@sansad.nic.in మెయిల్ ఐడీకి పంపాలి

ఇక ఖాళీల వివరాలు చూస్తే… ఫెలోషిప్ ఖాళీలు 4, ఇంటర్న్‌షిప్ ఖాళీలు 10 ఉన్నాయి. వీటిలో గ్రాడ్యుయేట్స్‌కి 5, పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌కి 5 పోస్టులు. ఈ ఫెలోషిప్, ఇంటర్న్‌షిప్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rajyasabha.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇక అర్హత చూస్తే.. ఇంటర్న్‌షిప్ కోసం ఏదైనా డిగ్రీ లేదా పీజీ పూర్తి కావాలి. ఫెలోషిప్ కోసం పీహెచ్‌డీ పాస్ కావాలి గమనించండి. ఇంటర్న్‌షిప్ గడువు 18 నెలలు. అదే ఫెలోషిప్ గడువు అయితే 2 ఏళ్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version